ETV Bharat / business

ఎయిర్​ ఇండియా ఉద్యోగుల భత్యాల్లో భారీ కోత - ఎయిర్​ ఇండియా ఉద్యోగుల భత్యాలు

ఉద్యోగుల భత్యాల్లో భారీ కోత విధించింది ఎయిర్​ ఇండియా. భత్యాల్లో 50శాతం కోత విధించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విమాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్​ 1 నుంచి ఈ కోత అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

Air India: Govt approves 50% slash in employee allowances amid protests
ఎయిర్​ ఇండియా ఉద్యోగుల భత్యాల్లో భారీ కోత
author img

By

Published : Jul 23, 2020, 5:45 AM IST

అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ.. ఉద్యోగుల భత్యాల్లో భారీగా కోత విధించింది ఎయిర్​ ఇండియా. పౌర విమానయాన శాఖ మార్గదర్శకాల మేరకు ఎయిర్​ ఇండియా బోర్డ్​ ఆఫ్​ డైరక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020 ఏప్రిల్​ 1 నుంచి తదుపరి ఆదేశాలు అందించేంత వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని విమాన సంస్థ వెల్లడించింది.

ఈ కోత కేవలం పైలట్లు, విమాన సిబ్బందికే కాకుండా.. అన్ని వర్గాల ఉద్యోగులకు వర్తించనుంది. అయితే వేతనం, ఐడీఏ, హెచ్​ఆర్​ఏ సహా ఇతర భత్యాల్లో ఎలాంటి మార్పులు లేవని ఎయిర్​ ఇండియా పేర్కొంది.

డీపీఈ మినహా.. ఇతర భత్యాలకు, ఆమోదించిన భత్యాల్లో 40శాతం కోత పడింది. ఫ్లైయింగ్​ అలవెన్స్​, ఎగ్జిక్యూటివ్​ ఫ్లైయింగ్​ అలవెన్స్​, స్పెషల్​ పే వైడ్​ బాడీ అలవెన్స్​, క్విక్​ రిటర్న్​ అలవెన్స్​ సహా మరికొన్ని ఈ పరిధిలోకి వస్తాయి.

సాధారణ కేటగిరీ అధికారుల జీతాలు, భత్యాల్లో(ఐడీఏ, హెచ్​ఆర్​) ఎలాంటి మార్పులు లేవు. కానీ ఇతర భత్యాల్లో 50శాతం మేర తగ్గించారు. సాధారణ కేటగిరీ సిబ్బంది, ఆపరేటర్ల భత్యాల్లో 30శాతం, శాశ్వత, కాంట్రక్ట్​ క్యాబిన్​ సిబ్బంది భత్యాల్లో 20శాతం కోత విధించింది ఎయిర్​ ఇండియా.

ఇదీ చూడండి:- ఇండిగోలో 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.