అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్... ఎస్బీఐ మరోమారు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. ఎమ్సీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. ఫలితంగా ఇప్పటివరకు 8.25 శాతంగా ఉన్న ఎమ్సీఎల్ఆర్... తాజా తగ్గింపుతో 8.15 శాతానికి చేరింది. కొత్త రేట్లు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది ఎస్బీఐ.
ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ రేట్లు తగ్గించడం ఇది మూడోసారి.
రిటైల్ టెర్మ్ డిపాజిట్ రేట్లనూ 20-25 బేసిస్ పాయింట్లు, బల్క్ టెర్మ్ డిపాజిట్ల రేట్లను 10-20 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇవి కూడా రేపటి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
బ్యాంకులు... రెపోరేటుకు అనుగుణంగా రుణాల రేట్లు సవరించాలని ఆర్బీఐ కోరింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ రుణరేట్లను తగ్గిస్తూ వస్తోంది. ఎస్బీఐ బాటలోనే మిగతా బ్యాంకులు పయనించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: దేశంలో ఈ ప్రాంతాలు చాలా 'ఖరీదు' గురూ!