దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఆంక్షలు, లాక్డౌన్ వంటి కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నాయి. ఈ కారణంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే సుమారు 75 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలో నిరుద్యోగం నాలుగు నెలల గరిష్ఠానికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది.
మార్చి నెలతో పోల్చితే 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ తెలిపారు. దీంతో నిరుద్యోగ రేటు భారీగా పెరిగినట్లు వెల్లడించారు.
ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు ఇలా..
- జాతీయ నిరుద్యోగం రేటు- 7.97శాతం
- పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం- 9.78 శాతం
- గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం- 7.13 శాతం
కరోనా కట్టడి ఆంక్షలతో.. ఆర్థిక కార్యకలాపాలు మందకొడిగా సాగాయి. ఆ ప్రభావం ఉద్యోగాలపై పడింది. రానున్నరోజుల్లో నిరుద్యోగం రేటు 24 శాతం వరకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది సీఎంఐఈ.
ఇవీ చూడండి: