ETV Bharat / business

జులైలో 82శాతం తగ్గిన దేశీయ విమాన ప్రయాణికులు

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య జులైలో (2019 జులైతో పోలిస్తే) 82 శాతం తగ్గింది. కరోనా భయాలే ప్రయాణికుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గడానికి కారణం. ఇదే సంవత్సరం జూన్​తో పోలిస్తే మాత్రం జులైలో ప్రయాణికుల సంఖ్య కాస్త పెరిగినట్లు డీజీసీఏ వెల్లడించింది.

Massively reduced air travel
భారీగా తగ్గిన విమాన ప్రయాణాలు
author img

By

Published : Aug 13, 2020, 7:29 PM IST

లాక్​డౌన్​ సడలింపుల తర్వాత జులైలో దేశీయంగా 21.07 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 జులైలో పోలిస్తే ఈ మొత్తం 82.3 శాతం తక్కువని పేర్కొంది.

అయితే ఇదే సంవత్సరం జూన్​లో ప్రయాణించిన 19.84 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే.. జులైలో ప్రయాణికుల సంఖ్య పెరగటం గమనార్హం.

దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన విమానయాన సంస్థల విమానాల్లో ఆక్యుపెన్సీ రేటు 50 నుంచి 60 శాతంగా ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది.

కంపెనీల పరంగా చూస్తే.. స్పైస్​జెట్ ఆక్యుపెన్సీ రేటు జులైలో అత్యధికంగా 70 శాతంగా నమోదైంది. ఎయిర్​ ఏషియా ఆక్యుపెన్సీ రేటు 45.5 శాతంగా ఉంది.

హైదరాబాద్​, బెంగళూరు, దిల్లీ, ముంబయి మెట్రో విమానశ్రయాల్లో జులైలో 98.1 శాతం ఉత్తమ పనితీరు (ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్)తో ఎయిర్ ఏషియా అగ్రస్థానంలో నిలిచింది.

సంస్థల వారీగా ప్రయాణికుల లెక్కలు..

జులైలో అత్యధికంగా ఇండిగో ఎయిర్​లైన్స్​లో 12.72 లక్షల మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో ఇండిగో వాటా 60.4 శాతం. గో ఎయిర్​లో అత్యల్పంగా 79 వేల మంది ప్రయాణించారు.

ఇదీ చూడండి:ఆప్టికల్​ ఫైబర్​ దిగుమతులపై చైనా సుంకాల పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.