ETV Bharat / business

ముకేశ్‌కు కలిసొచ్చిన 2019.. భారీగా పెరిగిన సంపద - Reliance Jio

ముకేశ్‌ అంబానీ మరోసారి సత్తాచాటారు. 2019లో ఈయన సంపద ఏకంగా 17 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.20 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధికం. ప్రారంభించిన మూడేళ్లలోనే టెలికాం రంగంలో జియో సంచలనాలు సృష్టించింది. భారత్‌లో అగ్రగామి సంస్థగా అవతరించింది.

2019 year is favourable for Mukesh Ambani
ముకేశ్‌కు కలిసొచ్చిన 2019
author img

By

Published : Dec 25, 2019, 8:26 AM IST

భారత శ్రీమంతుడు, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్‌ అంబానీ మరోసారి తనకు పోటీలేదని నిరూపించారు. 2019లో ఈయన సంపద ఏకంగా 17 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.20 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధికం. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల సూచీ ప్రకారం.. డిసెంబరు 23కు ముకేశ్‌ నికర సంపద దాదాపు 61 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4.27 లక్షల కోట్లు). ఇదే సమయంలో అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా సంపద 11.3 బిలియన్‌ డాలర్లు పెరగ్గా, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఆస్తి 13.2 బిలియన్‌ డాలర్లు తగ్గింది.

జోరుకు కారణాలివే

  • 2019లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ లాభంతో పోలిస్తే ఆర్‌ఐఎల్‌ షేరు రెట్టింపు పరుగులు తీసింది.
  • చమురు శుద్ధి, పెట్రో రసాయనాల వ్యాపారాల నుంచి నెమ్మదిగా రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ వంటి వినియోగదారు విభాగాల వైపు కంపెనీ అడుగులు వేయడం మదుపర్లను మెప్పించింది.
  • అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా స్థానిక ఇ-కామర్స్‌ సంస్థను నెలకొల్పాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
  • ప్రారంభించిన మూడేళ్లలోపే జియో.. భారత్‌లో అగ్రగామి టెలికాం సంస్థగా అవతరించి సత్తా చాటింది. వచ్చే మూడేళ్లలో కొత్త వ్యాపారాలు రిలయన్స్‌ ఆదాయంలో 50% సమకూర్చనున్నాయి.
  • 2021 నాటికి రిలయన్స్‌ గ్రూప్‌ను రుణరహిత సంస్థగా మారుస్తామని ప్రకటించడంతో షేరు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఇందు కోసం సౌదీ అరామ్‌కోకు వాటా విక్రయించనున్నట్లు అంబానీ ప్రకటించారు.
  • 2016లో రిలయన్స్‌ జియో సేవలు ప్రారంభమైన తర్వాత.. ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్‌ షేరు మూడింతలు లాభపడింది.

ఇదీ చూడండి: అంబానీ పేరుకు అర్థం తెలిస్తే షాక్​ అవుతారు

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT 'BOSTON POPS'
SHOTLIST:
BOSTON POPS SYMPHONY ORCHESTRA - MUST ON-SCREEN CREDIT 'BOSTON POPS'
Boston - 23 December 2019
1. Various of Boston Celtics player Tacko Fall taking stage, conducting
STORYLINE:
Boston Celtics player Tacko Fall made his debut as a guest conductor during the renowned Boston Pops orchestra's holiday concert.
The 7-foot-6 centre took the stage to lead the orchestra in a rendition of the song "Sleigh Ride" at Boston's Symphony Hall Monday night.
Fall donned a custom-made, size-48 double extra-long tuxedo.
He used a baton that was given to him by longtime conductor Keith Lockhart.
Lockhart called Fall "the tallest person to ever conduct the Boston Pops" before inviting him to come up on stage.
The audience cheered during the Fall's performance as he did a spin and wiggled his arms in time with the music.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.