ETV Bharat / business

11వేల మార్కుకు నిఫ్టీ

ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందన్న అంచనాల మధ్య స్టాక్​మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

స్టాక్​మార్కెట్లకు భారీ లాభాలు
author img

By

Published : Feb 6, 2019, 10:17 AM IST

దేశీయ, విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతుండగా స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 250పాయింట్లు పెరిగి 36వేల 865వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 75పాయింట్ల వృద్ధితో 11వేల 10 వద్ద ట్రేడవుతోంది.

వడ్డీరేట్ల మార్పు విషయంలో అమెరికా ఫెడరల్​ రిజర్వ్ మరింత కాలం వేచిచూసే ధోరణి అవలంబిస్తుందన్న వార్తలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రేపటి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లు యథాతథంగా ఉంచుతుందన్న అంచనాలు స్టాక్​మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఐటీ, లోహ రంగాల వాటాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

లాభనష్టాల్లోనివివే...

టెక్​ మహీంద్రా, జూబ్లియెంట్​ ఫుడ్​ల షేర్లు అత్యధికంగా 7 శాతం వృద్ధి చెందాయి. హెచ్​పీసీఎల్​, జీ ఎంటర్​టైన్​ మెంట్స్​, హెచ్​సీఎల్​ టెక్​, విప్రోలు లాభాల జాబితాలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, ఇన్ఫోసిస్​ 2 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్టీపీసీ, రెడ్డీస్​ ల్యాబ్స్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్​ కార్ప్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, అదానీ పోర్ట్స్​, టాటా మోటార్స్​ సంస్థలు అత్యధిక నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి మారకం విలువ

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. 5 పైసల వృద్ధితో డాలర్​తో పోలిస్తే 71.52 వద్ద ఉంది.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లలో జపాన్​ నిక్కీ 0.41 శాతం లాభపడింది. కొత్త సంవత్సరం సందర్భంగా చైనా, కొరియా మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.