ETV Bharat / briefs

ఎట్టకేలకు కురిసిన వర్షం.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఎట్టకేలకు రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఖమ్మంజిల్లా కొణిజర్లలో 80 మి.మీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఎట్టకేలకు కురిసిన వర్షం.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
author img

By

Published : Jun 18, 2019, 7:11 AM IST

Updated : Jun 18, 2019, 11:35 AM IST

ఎట్టకేలకు కురిసిన వర్షం.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఎండల తాకిడికి అల్లాడిపోయిన రాష్ట్ర వాసులకు ఉపశమనం లభించింది. సోమవారం అక్కడక్కడా కురిసిన చిరుజల్లులు సాంత్వన చేకూర్చాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 165 ప్రాంతాల్లో వర్షం కురిసినట్లు రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సొసైటీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఈనెల 22 నాటికి రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఇప్పుడు కురిసే వర్షాలు రుతుపవనాలవి కాదని పేర్కొన్నారు. మంగళ, బుధవారం కూడా ఒక మాదిరి వర్షాలు కురుస్తాయన్నారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. సోమవారం అత్యధికంగా నిజామాబాద్​లో 40.1, ఆదిలాబాద్​లో 39.8, హైదరాబాద్​లో 37.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదీ చూడండి: 'ఖమ్మం జిల్లాలో తొలకరి చినుకులు'

Intro:Body:

weather report

Conclusion:
Last Updated : Jun 18, 2019, 11:35 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.