ETV Bharat / briefs

సజావుగా ఎన్నికలు నిర్వహిస్తాం: నాగర్​కర్నూల్ కలెక్టర్ - MP ELECTION

నాగర్​కర్నూల్ పార్లమెంట్​ స్థానానికి ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ శ్రీధర్. పోలింగ్ కేంద్రాలకు ఓటర్​ స్లిప్​తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.

నాగర్​కర్నూల్ కలెక్టర్
author img

By

Published : Apr 9, 2019, 8:04 PM IST

నాగర్​కర్నూల్ లోక్​సభ స్థానానికి ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా పాలనాధికారి శ్రీధర్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,87,281 మంది ఓటర్లు ఉన్నారని... 1,936 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఓటర్​ స్లిప్​లతో పాటు ప్రభుత్వం ఆమోదించిన గుర్తింపు కార్డులలో ఏదైనా తీసుకురావచ్చన్నారు.

నాగర్​కర్నూల్ కలెక్టర్ శ్రీధర్

ఇవీ చూడండి: మావోల దాడిలో భాజపా ఎమ్మెల్యే మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.