ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో లేత పసుపు రంగు చీర, చలువ కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం ఉన్న బ్యాక్స్ , మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపించిన ఓ యువ అధికారిణి... సామాజిక మాధ్యమాలను షేక్ చేసింది. ఆమె ఎవరా అంటూ గూగుల్‌ను ప్రశ్నించారు నెటిజనం. ఆమె ఫొటోపై రకరకాల కథనాలు వచ్చినా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు.. వైరల్ గా మారాయి.
యూపీ రాజధాని లక్నోకు సమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న నగ్రామ్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఈ అధికారిణి పేరు రీనా ద్వివేదీ. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజాపన్నుల విభాగంలో ఆమె పనిచేస్తున్నారు. పోలింగ్‌కు ముందురోజు ఈవీఎంలను తీసుకెళ్తున్న సమయంలో ఓ ఫొటో గ్రాఫర్ రీనా ద్వివేదీ ఫొటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. అంతే... ఒక్కసారిగా ఆ ఫొటో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
తాజాగా.. ఆమె స్టైప్పులేస్తున్న కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.రీనా ద్వివేదీ ఫొటో చూసిన నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. ఆమె విధులు నిర్వరిస్తున్న పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ శాతం నమోదు కావొచ్చని ఒకరు కామెంట్ చేస్తే.. రీనా ద్వివేది లాంటి అధికారిణిని దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ విధుల కోసం ఎందుకు నియమించలేదంటూ మరొకరు సరదాగా ఆవేదన వ్యక్తం చేశారు.