ఈడీ కార్యాలయానికి ఉదయ్‌సింహా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కేసుకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను వెంటతీసుకొచ్చారు. ఈ కేసులో ఉదయ్‌సింహా ఏ3గా ఉన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్‌కు గతవారమే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ గడువు రేపటితో ముగుస్తుంది. ఈనెల 12న ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, అతడి ఇద్దరు కుమారులను ఈడీ అధికారులు విచారించారు.