టీఆర్టీ ఉపాధ్యాయుల నియామకాలు వెంటనే చేపట్టేలా చూడాలని లేని పక్షంలో కారుణ్య మరణాలకైనా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు అభ్యర్థులు బైఠాయించారు. ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్ల కుటుంబ పోషణ భారమయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
2017లో టీఎస్పీఎస్సీ టీఆర్టీ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 25న పరీక్ష నిర్వహించి, ఆగస్టులో 1:1 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. నెలలు గడుస్తున్నా తుది ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల 8792 మంది అభ్యర్థుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభ అనుభవిస్తున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ... సుమారు వెయ్యి మంది అభ్యర్థులు హెచ్చార్సీ గేటు ముందు బైఠాయించారు.
మరోవైపు టీఆర్టీ ఆందోళనకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు ప్రకటించారు.
ఇవీ చూడండి: సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థుల అరెస్ట్