ETV Bharat / briefs

ఉపఎన్నికలకు తెరాస అభ్యర్థుల పేర్లు ఖరారు? - ఉపఎన్నికలకు తెరాస అభ్యర్థుల పేర్లు ఖరారు?

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం ఇప్పటికే తెరాస కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, వరంగల్​, నల్గొండ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంతో... మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం.

మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన
author img

By

Published : May 7, 2019, 6:31 AM IST

Updated : May 7, 2019, 7:30 AM IST

మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు తెరాస అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తైంది. రంగారెడ్డి స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డి, వరంగల్​ స్థానంలో పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి, నల్గొండ నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్​రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. కొడంగల్​ నుంచి తెరాస ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్​ రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి, వరంగల్​లో కొండా మురళీధర్​రావు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయటం వల్ల ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది.

ఇచ్చిన హామీల మేరకే...

ఈ ఎన్నికలపై ఇప్పటికే తెరాస కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి స్థానం కోసం మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డి చేవెళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేయకుండా ఉన్నారు. వరంగల్​ స్థానంలో పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డిని పోటీకి నిలపాలని అధిష్ఠానం భావిస్తోంది. కేటీఆర్​కు సన్నిహితుడు కావటం, అన్ని విధాలుగా బలంగా ఉండటం వల్ల ఆయన విజయం ఖాయమనే భావనలో తెరాస ఉంది. నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్​రెడ్డికి అవకాశం దక్కనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకే నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్​ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకై 14 వరకు గడువు ఉంది. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులను తెరాస ప్రకటించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​​ రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు, నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి: మొదటి దశ పరిషత్​ పోరులో 76.80% పోలింగ్​

Last Updated : May 7, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.