లోక్‌సభ ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన.. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు , పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలకు స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు వివరించాయి.
ఇవీ చూడండి: కారు చూపు... హుజూర్నగర్ వైపు!