ETV Bharat / briefs

హీరో సందీప్​కు ఆ లక్షణాలున్న అమ్మాయి కావాలి! - సందీప్​ కిషన్​ పెళ్లికి ఇలాంటి అమ్మాయి కావాలంట

తనకు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పిన హీరో సందీప్ కిషన్.. వచ్చే అమ్మాయిలో కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పాడు. అలాంటి యువతి మెడలోనే తాళి కట్టాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

sandeep kishan
సందీప్​ కిషన్​
author img

By

Published : Jun 17, 2020, 8:22 PM IST

Updated : Jun 17, 2020, 8:28 PM IST

టాలీవుడ్​లోని​ బ్యాచిలర్​ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నిఖిల్​ ఓ ఇంటివాడవగా.. రానా, నితిన్​ త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా బ్యాచిలర్​ కథానాయకుల పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంతమంది నవ్వుతూ, మరికొంతమంది ఏదో సాకు చెప్పి దీని నుంచి తప్పించుకుంటున్నారు. ఇదే విషయమై మాట్లాడిన సందీప్ కిషన్.. కొన్ని లక్షణాలు చెప్పి, అటువంటి అమ్మాయి మెడలోనే తాళి కడాతనని అన్నాడు.

ఇందులో భాగంగా చురుకుదనం, తెలివి, దృఢంగా, స్ఫూర్తినిచ్చే తత్వం కలగలపిన లక్షణాలు ఉన్న యువతి మెడలోనే మూడు ముళ్లు వేయాలనుకుంటున్నట్లు సందీప్ చెప్పుకొచ్చాడు.

'రామకృష్ణ తెనాలి బి.ఏ.బి ఎల్' సినిమాతో గతేడాది నవ్వులు పంచిన సందీప్.. ప్రస్తుతం 'ఏ వన్ ఎక్స్​ప్రెస్' అనే హాకీ నేపథ్య కథలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. డెన్నీస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది చూడండి : 'బన్నీని స్ఫూర్తిగా తీసుకునే సిక్స్ ప్యాక్ చేశా'

Last Updated : Jun 17, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.