ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ నిర్మాతగానూ విజయాలనందుకుంటున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై 'ఖైదీ నంబరు 150', 'సైరా' వంటి చిత్రాలు నిర్మించాడు చరణ్. మలయాళంలో ఘన విజయం అందుకున్న 'లూసిఫర్' రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. మోహన్‌లాల్ కథానాయకుడిగా దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు రీమేక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా స్పష్టత రాలేదు.
తాజాగా మరో మలయాళ చిత్ర రీమేక్ హక్కులు చరణ్ తీసుకున్నాడని సమాచారం. 'లూసిఫర్' కథానాయకుడు పృథ్వీరాజ్ నటించిన ఈ చిత్రం 2019లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. లాల్ దర్శకుడు. రవాణాకు సంబంధించిన కథతో ఆసక్తిరేకెత్తించారు. తెలుగు ప్రేక్షకులకు ఆ వినోదం అందించేందుకు చెర్రీ సిద్ధమయ్యాడు. ఇందులో ఓ మెగా హీరో నటిస్తాడని, చెర్రీ అతిథి పాత్ర పోషిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.