సోషల్ మీడియాలో ఇప్పుడు స్ట్రెచ్ ఛాలెంజ్ సంచలనంగా మారుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ కథానాయికలు ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తూ అభిమానులు ముక్కున వేలేసుకొనేలా చేస్తున్నారు. గతంలో ఓ సారి కథానాయిక పూజాహెగ్డే 'స్ట్రెచ్ ఛాలెంజ్'ను స్వీకరించి ఎంతో సునాయాసంగా చేసింది.
ఇప్పుడు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఈ ఛాలెంజ్‌ను తీసుకొంటున్నారు. ఇప్పుడు మరో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి తను స్ట్రెచ్ అయిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘పూర్తిగా స్ట్రెచ్ కాలేకపోయాను మరోసారి ప్రయత్నిస్తా’’ అని రాసింది. అందంతో పాటు ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా కథానాయికలు సాహసాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇవీ చదవండి: