కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పక్కన పెట్టిన వైనాన్ని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రావిటీతో నీరు వచ్చే అవకాశం ఉన్నా... ఎత్తిపోతల పథకాలను ప్రవేశపెట్టి అంచనాలను ఏ విధంగా పెంచారో పేర్కొన్నారు. 2014 నాటి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులో దాదాపు 9వేల కోట్లు ఖర్చు చేస్తే... గ్రావిటీ కెనాల్‌ను పక్కన పెట్టి కొత్త స్కీమ్ తీసుకొచ్చి, 38వేల ప్రాజెక్టును 80వేలకు పెంచి కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారని మండిపడ్డారు.
ఇదీ చూడండి: ఫౌంటెన్‌ని తలపిస్తోన్న పగిలిన మిషన్ భగీరథ పైపులైన్లు