ETV Bharat / state

ఓవైసీ కనుసన్నల్లోనే పోలీస్ నియామకాలు, బదిలీలు : కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి - TG BJP CHIEF KISHAN REDDY

6 గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు - కేసీఆర్​ బాటలోనే రేవంత్​ రెడ్డి - అరాచకాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

KISHAN REDDY FIRE ON TG GOVT
TELANGANA BJP CHIEF KISHAN REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 4:38 PM IST

Updated : Nov 15, 2024, 5:08 PM IST

Kishan Reddy Fire on TG Govt : సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సస్యశ్యామలమైందని మహారాష్ట్రలో ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న కిషన్‌రెడ్డి, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.

మాటలు ప్రజలకు మూటలు పార్టీకి అని ప్రభుత్వంపై కిషన్​ రెడ్డి ఆరోపణలు (ETV Bharat)

బోగస్ బోనస్ పేరుతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. చర్చలతో పరిష్కరించాల్సిన సమస్యను కలెక్టర్ పైన దాడి జరిగేలా చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవ్వరినైనా కలవచ్చన్న కిషన్‌రెడ్డి, గవర్నర్ ఏ సంతకం పెడుతున్నారని కేంద్రం పర్యవేక్షిస్తుందా? అని ప్రశ్నించారు. కేటీఆర్​ను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సస్యశ్యామలమైందని మహారాష్ట్రలో ప్రకటనలు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఏం ఒరిగిందని రాహుల్ గాంధీ పొగుడుతున్నారని రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాటలు ప్రజలకు మూటలు పార్టీకి, కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. అశోక్ నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రైతు భరోసా రూ. 15 వేలు కాదు 15 పైసలు కూడా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఫామ్ హౌస్​లలో దొంగ చాటుగా కేసీఆర్ వీడియోలు తీయించారు, ఈ విషయంలో కేసీఆర్​కు పద్మ శ్రీ ఇవ్వాలన్నారు. ఓవైసీ కనుసన్నల్లో పోలీస్ నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదారాబాద్ చుట్టు పక్కల హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చర్చలతో పరిష్కరించాల్సిన సమస్యను కలెక్టర్ పైన దాడి జరిగేలా చేశారన్నారు. తెలంగాణ సమాజం కోరుకున్న నూతన తెలంగాణ ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే కాంగ్రెస్ పార్టీ మరిన్ని అప్పులు చేస్తుందని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని తెలిపారు. నిర్మాణాత్మకంగా, చిత్తశుద్దితో బీఆర్ఎస్ పాలించలేదు, కాంగ్రెస్ డీఎన్ఏలో చిత్తశుద్దే లేదు. కాంగ్రెస్​కు ఏకైక ఏటీఏం సెంటర్​గా తెలంగాణ ఉందని అన్నారు.

బీజేపీ వ్యతిరేకం కాదు : బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి నిర్మాణాత్మకంగా, చిత్తశుద్దితో పాలించలేదని విమర్శించారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే చిత్తశుద్ది లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏకైక ATM సెంటర్​గా ఇప్పుడు తెలంగాణనే ఉందన్నారు. మూసీ పునరుజ్జీవానికి ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో కార్యాచరణ, డీపీఆర్​లు ప్రభుత్వం వద్ద లేవని తెలిపారు.

హైదరాబాద్​లో పేదల ఇళ్లు కూల్చి నల్గొండ జిల్లలోని రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇళ్లు కుల్చొద్దు అంటే ముఖ్యమంత్రి బుల్డోజర్లతో తొక్కిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. పేదల కోసం చావడానికైనా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సీఎ రేవంత్​ రెడ్డి సవాల్​ను స్వీకరిస్తూ రేపు మూసీ నది పరివాహక ప్రాంతం పక్కనే రాత్రి బస చేయనున్నట్లు చెప్పారు.

బీఆర్​ఎస్​తో పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి

పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్‌ రెడ్డికి - బడా బాబుల ఫామ్‌హౌస్‌లు కూల్చే దమ్ముందా? : కిషన్‌రెడ్డి - KSHAN REDDY SLAMS CM REVANTH

Last Updated : Nov 15, 2024, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.