ETV Bharat / state

కార్తిక పౌర్ణమి స్పెషల్‌ : శివుణ్ని దర్శించుకున్న ఎలుగుబంట్లు! - హడలిపోయిన భక్తులు - BEARS HALCHAL IN SRIKAKULAM

శ్రీకాకుళం సువర్ణపురంలో శివాలయంలో ఎలుగు బంట్ల హల్‌చల్‌ - ఆందోళనకు గురైన స్థానికులు

Bears Halchal In Srikakulam
Bears Halchal In Srikakulam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 4:45 PM IST

Bears Halchal In Srikakulam : దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లిన వారికి గుడిలో గుండె పగిలే ఓ దృశ్యం ఎదురైంది. ఆలయం లోపలికి ఇలా వెళ్లగానే అలా ఎలుగు బంట్లు హల్‌చల్‌ చేస్తూ కనిపించాయి. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలోని శివాలయంలో జరిగింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్థానికంగా ఉండేవారు తెల్లవారుజామున శివుణ్ని దర్శించుకునేందుకు వెళ్లారు. లోపలికి ఇలా వెళ్లారో లేదో 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అలా అవి సంచరించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంట్లు అటూ ఇటూ తిరుగుతూ కాసేపు అలజడి సృష్టించాయి. దీంతో స్థానికులు కర్రలతో బెదిరించారు. కాసేపటికి ఎలుగుబంట్లు సమీపంలోని తోటల్లోకి వెళ్లడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎలుగుబంట్లతో సన్యాసి స్నేహం- ఆహారం, నీరు అందిస్తూ అన్నీతానై!

శివయ్యకు పూజలు చేసిన వానరం : పిలిస్తే పలికే స్వామి ఆ ఈశ్వరుడు, అలాంటి శివయ్యకు ఇష్టమైన కార్తిక మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో భోళాశంకరుడిని నియమ నిష్ఠలతో పూజిస్తుంటారు. ప్రతి ఏడాది దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఈ కార్తిక మాసం మొదలవుతుంది. ఓం నమః శివాయ అనే నామస్మరణతో ప్రతి పల్లె, పట్టణంలోని శైవక్షేత్రాలు నెల రోజులపాటు మార్మోమోగుతుంటాయి. ఈ మాసానికి పురాణ కాలం నుంచి చాలా ప్రత్యేకత. కార్తిక మాసం ప్రారంభమైన దగ్గరి నుంచి భక్తులు విశేషంగా శివాలయాలకు తరలి వెళ్లి దీపారాధన చేస్తున్నారు.

మేడ్చల్ -​ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో ఓ కోతి శివయ్యను భక్తితో పూజించింది. అది చూసిన భక్తులు ఆశ్యర్యానికి గురయ్యారు. 'ఎలా పూజ చేయాలో తెలియదు ఏ పూలు తెచ్చి పూజించాలో అర్థం కావడం లేదు. అభిషేకం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు శివయ్యా! నీవే అర్థం చేసుకుంటావని, అనుగ్రహిస్తావని అనుకుంటున్నా ఈశ్వరా!' అంటూ కోతి శివుడిని హత్తుకుని ప్రార్థించింది. ఈ సన్నివేశం రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాల దగ్గర జరిగింది. భక్తులు రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేస్తారు. ఆ సమయంలో శివ లింగం వద్దకు వచ్చిన ఓ కోతి, తన్మయత్వంతో విశ్వేశ్వరుడిని మొక్కడం భక్తులను ఆకర్షించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరో ఎలుగుబంటి సంచారం.. భయం గుప్పిట్లో జనం

Bear Wanders in Karimnagar : నన్నెవడ్రా ఆపేది.. పట్టపగలే దర్జాగా రోడ్లపై తిరుగుతున్న ఎలుగుబంటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.