ETV Bharat / entertainment

'కంగువా' డైరెక్టర్​ శివ నెక్ట్స్​ సినిమా - ఆ స్టార్​ హీరోతోనే! - DIRECTOR SIVA NEXT MOVIE

'కంగువా' డైరెక్టర్​ శివ తర్వాతి ప్రాజెక్ట్​ ఇదే - ఏ హీరోతో చేయబోతున్నారంటే?

Kanguva Director Siva Next Movie
Kanguva Director Siva Next Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 4:51 PM IST

Kanguva Director Siva Next Movie : కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్​ పీరియాడిక్​ యాక్షన్ ఫిల్మ్ కంగువా. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించగా, బాలీవుడ్ భామ దిశా పటాని, బాలీవుడ్ స్టార్‌ యాక్టర్​ బాబీ దేఓల్​ కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో తాజాగా విడుదలైన ఈ కంగువా చిత్రం మిక్సడ్​ టాక్​ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా మీడియాతో ముచ్చటించారు.

జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - దర్శకుడు శివ తన తర్వాతి సినిమాను హీరో అజిత్ కుమార్​తో చేయబోతున్నారు. ఆ చిత్రం పూర్తవ్వగానే కంగువా 2 కోసం పని చేస్తారు. రెండో భాగం చాలా బాగుంటుంది. మొదటి భాగం సినిమాలో బీజీఎమ్​ లౌడ్ నెస్ చాలా ఎక్కువగా ఉందన్న విమర్శలు మా దృష్టికి వచ్చాయి. మేము ఎగ్జిబిటర్లందరితో ఈ విషయం గురించి మాట్లాడం. లౌడ్‌నెస్ తగ్గించేందుకు వాల్యూమ్ రెండు పాయింట్లను తగ్గించమని అభ్యర్థించాం. ఇది దేవీ శ్రీ పొరపాటు కాదు. సౌండ్ మిక్సింగ్ వల్ల జరిగింది. సూర్య గత చిత్రాల ఫుల్ రన్ కలెక్షన్లను కంగువా 2-3 రోజుల్లో దాటుతుంది. సినిమా కమర్షియల్‌ పెర్‌ఫార్మెన్స్‌ పట్ల ఆనందంగా ఉన్నాం. రెండో భాగం సీక్వెల్ షూటింగ్​ 2025 ఏప్రిల్​లో ప్రారంభిస్తాం. 2026 పొంగల్ హాలీడేస్​కు రిలీజ్​ ప్లాన్ చేస్తాం అని చెప్పుకొచ్చారు.

కాగా, శివ - అజిత్​ది మంచి హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో వీరమ్​, వేదాలం, విశ్వాసం చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. స్పై థ్రిల్లర్​ వివేగం మాత్రం మిక్సడ్​ రివ్యూస్​ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. వాస్తవానికి హై ఆక్టేన్​, ఫ్యామిలీ సెంట్రిక్​ యాక్షన్ డ్రామాస్​ తీయడంలో శివ దిట్ట. అయితే ఈ కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు వచ్చి వివేగమ్​, కంగువా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇవి కాస్త మిక్స్​డ్​ టాక్​ను దక్కించుకున్నాయి.

ఇక కంగువా విషయానికొస్తే సినిమాలో సూర్య నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. వన్‌ మ్యాన్‌ షో అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇందులో సూర్య ఫ్రాన్సిస్, కంగువా రెండు పాత్రల్లో కనిపించారు. వెయ్యేళ్ల కిందటి జానపద కథను వర్తమాన కాలానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించారు.

మలయాళ డైరెక్టర్​తో నాని కొత్త మూవీ! - నేచురల్ స్టార్ లైనప్​లో ఎన్ని సినిమాలంటే?

'ఓ సారి అలా ప్రయత్నించండి' - హీరో జయంరవి దంపతులకు కోర్టు కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.