Reliance Foundation Kahani Kala Khushi : రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం విధితమే. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రిలయన్స్ ఫౌండేషన్. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 457 అంగన్వాడీ కేంద్రాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కహానీ కళా ఖుషీ' అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కథ చెప్పడం, కళ, ఆటలు ఆధారిత కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకతను ప్రేరేపించనుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా 457 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కహానీ కళా ఖుషీ కార్యక్రమం జరగనుంది. నవంబర్ 14, 16వ తేదీల్లో జరిగే ఈ వేడుకల్లో సుమారు 8,000 మంది చిన్నారులు పొల్గొంటున్నారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖతో సంయుక్తంగా రిలయన్స్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
కథ చెప్పడం : విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీలు : చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తేసేందుకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
కుషీ : మ్యూజిక్, మెమరీ గేమ్స్
రిలయన్స్ ఫౌండేషన్ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ ఫౌండేషన్ ద్వారా గ్రామాల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, క్రీడాభివృద్ధి, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత, పట్టణ పునరుద్ధరణ, కళలు అంశాలపై విశేషమైన కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా 60,500 గ్రామాలు, పట్టణాల్లోని 79 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను మార్చేందుకు కృషి చేసింది. ఇప్పటికే ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో 1,100కు పైగా అంగన్వాడీ కేంద్రాల్లో 18,000 మంది పిల్లలతో రిలయన్స్ ఫౌండేషన్ బాలల దినోత్సవాన్ని నిర్వహించింది.
ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త వేస్తున్నారా? - ఇకపై మీ ఫొటోలు తీసి, మైక్‌లో అనౌన్స్ చేస్తారు
హైదరాబాద్‌ను రక్షించుకునేందుకు 'మహా ప్రణాళిక' - ఆ కష్టాలకు ఇక పర్మినెంట్‌గా చెక్!