ఈనెల 17న ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొ. రామచంద్రం తెలిపారు. జులై 2012 నుంచి జూన్ 2018 మధ్య కాలంలో విద్యను అభ్యసించిన వారికి డిగ్రీ, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 1,100 మంది విద్యార్థులలో 292 మందికు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్స్ అందిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,896 మంది పీహెచ్డీ పూర్తిచేయగా 1096 మంది ఇంకా తమ డిగ్రీ ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉందన్నారు. విద్యార్థులు ఎంట్రీపాస్‌లను అంతర్జాలంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి చరవాణిలు తీసుకురావొద్దని సూచించారు. కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు http://ou80thconvocation.live.streams9.in లో చూడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్, ఓఎస్డీ కృష్ణారావు, పీఆర్వో సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మైకేల్ జాక్సన్‌లా అదరగొట్టిన మెట్రో డ్యాన్సర్