ETV Bharat / briefs

మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త..!

దంపతుల మధ్య తలెత్తిన గొడవలో భార్య ముక్కు కొరికేశాడు ఓ భర్త. మత్తుకు బానిసగా మారిన తన ఆగడాలను భార్య ప్రశ్నిస్తోందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. పంజాబ్​లోని బటిండాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త..!
author img

By

Published : May 21, 2019, 7:49 PM IST

Updated : May 21, 2019, 9:29 PM IST

మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త..!

పంజాబ్​లోని బటిండా నగరంలో దారుణం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచి చెప్పిన భార్య ముక్కును కొరికేశాడు ఆమె భర్త అమన్​దీప్​ మిట్టల్​. బాధిత మహిళ 'షీతల్'... స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలి​గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వీరు బతిండాలోనే కలిసి జీవిస్తున్నారు. అయితే, కొంతకాలంగా అమన్​దీప్​ మత్తుకు బానిసగా మారాడు. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. షీతల్​కు ఇది రెండో వివాహం కాగా అమన్​దీప్​కు మూడోది.

తాజాగా మత్తుపదార్థాలు సేవించి ఇంటికొచ్చిన భర్తతో గొడవపడ్డారు షీతల్​. భార్య ప్రశ్నలతో కోపంతో ఊగిపోయిన అమన్​దీప్​ ఆమెపై భౌతిక దాడి చేశాడు. అదే క్రమంలో పంటితో భార్య ముక్కును కొరికేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమన్​దీప్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు షీతల్​. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: ఒకే కాన్పులో అరడజను​ మంది పిల్లలు

Shopian (J-K), May 21 (ANI): An exchange of fire broke out between terrorists and joint team of security forces in Jammu and Kahsmir's Shopian. The encounter is underway in the forest area of Yarwan. More details are awaited.
Last Updated : May 21, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.