నల్గొండలో పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మధ్యాహ్నం వరకే సామాగ్రి అందించారు. ఉద్యోగులంతా.. తమకు కేటాయించిన కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో చేరుకున్నారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ స్థానాలున్నాయి. నల్గొండ పరిధిలో 1990 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 293 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియో చిత్రీకరణకు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలింగ్ అధికారులు సూచించారు. పార్టీలు ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఎన్నికల పండుగకు ప్రత్యేక రైళ్లు