ETV Bharat / briefs

ప్రభుత్వ వైఫల్యంతోనే వైద్యులపై దాడి: బండి సంజయ్

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. వైద్యులపై దాడి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు ఎలాంటి సహకారం అందించట్లేదని సంజయ్ మండిపడ్డారు.

author img

By

Published : Jun 10, 2020, 8:05 PM IST

వైద్యులపై దాడి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే: బండి సంజయ్

గాంధీ ఆసుపత్రి విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వాగ్ధానాన్ని నిలుపుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆక్షేపించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడిని సంజయ్ ఖండించారు. వైద్యులపై దాడి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో మహమ్మారిని ఎదుర్కొంటుంటే సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్‌లో, ఫాంహౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటూ... నీరో చక్రవర్తిని మరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైద్యులకు కావాల్సిన అన్ని రకాల రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సంజయ్‌ పేర్కొన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల పేరుతో రాష్ట్రంలో తగిన స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించకుండా ప్రజలను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు మంజూరు చేసినా... లక్షలాదిగా ఎన్ -95 మాస్కులు, పీపీఈ కిట్లను సరఫరా చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి సహకారాన్ని వైద్యులకు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చించి... వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.