దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం రఫేల్ ఒప్పందమేనని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఎంతమేర సొమ్ము చేతులు మారిందనేది తెలియకపోయినా తెరవెనక మాత్రం భారీ తతంగం జరిగిందని నమ్ముతున్నట్లు దీదీ పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఇంత అవినీతి ప్రధానిని చూడలేదని ఆరోపించారు మమత. మోదీని 'మిస్టర్ మ్యాడీ'గా అభివర్ణించారు.
"దేశం ఐక్యమయ్యింది, 24 పార్టీలు ఏకమయ్యాయి. "మోదీ హటావో....దేశ్ బచావో" అనేది మా నినాదం. మా ప్రథమ కర్తవ్యం రాజ్యాంగ పరిరక్షణ, దేశ ప్రజలను రక్షించడమే. మా ఐక్యతను చూసి ఆయన భయపడుతున్నారు. ప్రతిపక్ష కూటమితో ఆయనకు నిద్ర పట్టడం లేదు. 2014 ఎన్నికల్లో చాయ్వాలాగా ప్రకటించుకున్నారు ఎప్పుడు చాయ్ అమ్మనే లేదు. ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంటారు. అవినీతికి, విద్వేషానికి మోదీ గురువు. ఇంతలా దిగజారిన ప్రధానిని ఇంతకుముందెప్పుడూ చూడలేదు." -మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి