భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని రామాంజనేయకాలనీకి చెందిన సాయికిరణ్ అనే యువకుడు అరాచకానికి తెగబడ్డాడు. మద్యం మత్తులో గొంతు, చేతులు కోసుకుని బీభత్సం సృష్టించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... తీవ్రంగా గాయపడ్డ సాయికిరణ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా సాయికిరణ్ పలుమార్లు కాళ్లు, చేతులు కోసుకుని బెదిరించేవాడని గ్రామ ఉప సర్పంచ్ తెలిపాడు. ఈసారి మాత్రం గొంతు కోసుకోవటం వల్ల పరిస్థితి విషమంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సాయికిరణ్ మాట్లాడుతున్నప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు వెల్లడించాల్సి ఉంది. వైద్యం కొనసాగిస్తున్నారు.
ఇవీ చూడండి: నిద్రిస్తున్న గార్డును బలితీసుకున్న ట్యాంకర్