బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటించనుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త బయటకొచ్చింది. జయ పాత్రలో నటించేందుకు కంగనా రూ.24 కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలూ దీనికి అంగీకరించారని టాక్.
ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కంగనా అయితే త్వరగా అభిమానులకు చేరువవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.