ETV Bharat / briefs

'5జీ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకోవాలి' - niti aayog ceo

5జీ సాంకేతికతను భారత్​ త్వరితగతంగా అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​. దీని ద్వారా అంతర్జాల వినియోగం, వేగం పెరిగి ప్రజల జీవన విధానం మెరుగవుతుందన్నారు. 5జీ కోసం కొన్ని విభాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాలని సూచించారు.

5జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
author img

By

Published : Oct 19, 2019, 10:36 AM IST

Updated : Oct 19, 2019, 1:38 PM IST

5జీ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకోవాలి

టెలికాం రంగంలో భారత్​ త్వరలో 5జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు నీతి ఆయోగ్​ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అమితాబ్​ కాంత్​. 5జీ సాంకేతికతకు సంబంధించిన కొన్ని భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాలని సూచించారు. పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన 'మెగ్నిఫీషియంట్​ మధ్యప్రదేశ్​' కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కాంత్.​

"త్వరలోనే 5జీ సాంకేతికతను భారత్​ ప్రారంభించాలి. ఇది సాంకేతిక పరికరాలను అనుసంధానిస్తుంది, డేటా ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. 5జీ తో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేశీయ సాకేంతికతతో కొన్ని భాగాలను రూపొందించాలని నేను సూచిస్తున్నా. అంతర్జాల డేటా ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగం అధికంగా ఉంది. మూడేళ్లలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది."

- అమితాబ్​ కాంత్, నీతి ఆయోగ్​ ముఖ్య కార్యనిర్వహణ అధికారి.

5జీ సాంకేతికతతో అంతర్జాల వినియోగం, వేగం పెరిగి ప్రజల జీవన విధానం సులభమవుతుందన్నారు కాంత్​. మెషీన్​ లెర్నింగ్​, కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ.. డేటా నిపుణులు, డేటా శాస్త్రవేత్తల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇదీ చూడండి: '18 బిలియన్​ డాలర్లకు భారత్​-అమెరికా రక్షణ భాగస్వామ్యం'

AP Video Delivery Log - 0200 GMT News
Saturday, 19 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0105: US TX Man Killed Home Invasion Must Credit KTRK, No Access Houston, No Use US Broadcast Network, No Re-sale, reuse or archive 4235611
Police release surveillance video in man's death
AP-APTN-0103: US AK Women Killed Must credit KTVA; No access Anchorage; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4235615
Alaska man charged in death of second woman
AP-APTN-0102: Iraq Syrian Refugee Family AP Clients Only 4235614
Syrian family displaced for 2nd time feel betrayed
AP-APTN-0101: UK NIreland Brexit Reax AP Clients Only 4235613
Reax in NIrish town to prospect of Brexit deal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 19, 2019, 1:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.