ఉపాధి కోసం దుబాయి వెళ్లిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూర్ మండలం చిన్నముర హరిపురానికి చెందిన జగదీశ్వర్ రావు ఆర్నెళ్ల క్రితం ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్న జగదీశ్ నుంచి 2 నెలలుగా ఎలాంటి సమాచారం లేదని తల్లిదండ్రులు వాపోయారు. ఏజెంట్‌కు, దుబాయ్‌లోని కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాంగశాఖ స్పందించి తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియాసమావేశంలో కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: అమెరికాలో నలుగురు భారతీయులు హత్య