ETV Bharat / briefs

రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన

గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే వివిధ ప్రతిపాదనలపై బుధవారం 2 రాష్ట్రాల నిపుణులు విడివిడిగా హైదరాబాద్​లో సమావేశమై చర్చించారు. ఒకే చోట నుంచి కాకుండా 2 రాష్ట్రాల నుంచి రెండేసి టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన
author img

By

Published : Jul 4, 2019, 5:03 AM IST

Updated : Jul 4, 2019, 8:31 AM IST

రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన

గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు నీటిని మళ్లించేందుకు సూత్రప్రాయంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించిన కసరత్తు ఇంకా కొనసాగుతోంది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే వివిధ ప్రతిపాదనలపై బుధవారం 2 రాష్ట్రాల నిపుణులు విడివిడిగా హైదరాబాద్​లో సమావేశమై చర్చించారు. ఒకే చోట నుంచి కాకుండా 2 రాష్ట్రాల నుంచి రెండేసి టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అధికారుల నుంచి ఆ ప్రతిపాదన ఉన్నట్లు ఏపీ అధికారులు పేర్కొన్నారు. రెండు టీఎంసీలకు తెలంగాణ భూభాగంలోని అనువైన ప్రాంతం నుంచి, మరో రెండు టీఎంసీలను పోలవరం ఎగువ నుంచి మళ్లిస్తే ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. అయితే వ్యయ భారం అధికంగా ఉండచ్చనే అంశం కూడా పరిశీలనలో ఉంది.

హైదరాబాద్​లో ఏపీ నిపుణుల కమిటీ భేటీ

హైదరాబాద్​లోని పోలవరం అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ నిపుణుల కమిటీ సమావేశమైంది. హైడ్రాలజీ చీఫ్ ఇంజినీర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో పలువురు అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఇందులో పోలవరం నుంచి ఎత్తిపోతల కాలువ... ఆపై పులిచింతల.. అక్కడి నుంచి టెయిల్​పాండ్ నాగార్జున సాగర్, శ్రీశైలానికి నదీమార్గం మీదుగా మళ్లించే సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చించారు. సీఎం జగన్ సూచన మేరకు ఈ ప్రతిపాదన ఎంతవరకు సాకారమవుతుందనే అంశంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 8 లేదా 9న పూర్తికానున్న కసరత్తు

పోలవరం నుంచి 2 టీఎంసీలు సాగర్ వరకు మళ్లించడం, తెలంగాణలోని ఏదో ప్రాంతం నుంచి 2 టీఎంసీలను శ్రీశైలానికి మళ్లించడం అనే కోణంలోనూ కొంత పరిశీలన సాగుతోంది. దుమ్ముగూడెం నుంచి మళ్లింపుపై తెలంగాణ ఇంజినీరింగ్ అధికారుల్లో సానుకూలత లేకపోగా... శ్రీశైలం, నాగార్జున సాగర్​లకు ఒకే చోట నుంచి నీటిని మళ్లించాలనుకుంటే ఇదే ఉత్తమ ప్రతిపాదనగా ఏపీ నీటి పారుదల నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 8న లేదా 9న గానీ 2 రాష్ట్రాల కమిటీల కసరత్తు పూర్తికానుంది. ఇరు రాష్ట్రాల కమిటీలు సమావేశమై తుది కసరత్తు జరుపుతాయి. ఏకాభిప్రాయంతో ప్రతిపాదనను కొలిక్కి తీసుకురావడమో... సీఎంల ముందుకు తీసుకెళ్లి తుది నిర్ణయం వారికే వదిలేయడమో... అన్నది నిర్ణయిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: "ప్రవేశాలలోపు రుసుములు ఖరారు చెయ్యండి"

Intro:Body:Conclusion:
Last Updated : Jul 4, 2019, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.