హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధి నారపల్లిలో ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం వేళ పరిశ్రమ నుంచి నల్లటి పొగలు వచ్చాయి. కొద్ది నిమిషాల తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందులో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మూడు వాహనాలతో సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కొంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.
ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య అనుమతులు లేకుండా ఇలాంటి పరిశ్రమలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'భాజపా మేనిఫెస్టోలో పసుపుబోర్డు అంశం లేదు'