ETV Bharat / briefs

విద్యా వాక్స్​ పాట వింటూ జడేజా కసరత్తులు! - lates ipl news

ఐపీఎల్​ నిమిత్తం దుబాయ్​కి చేరుకున్న చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు.. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉంది. ఈ క్రమంలోనే హోటల్​ గదిలో జడేజా కసరత్తులు చేస్తున్న వీడియోను సీఎస్కే ట్విట్టర్​ ద్వారా అభిమానులతో పంచుకుంది.

CSK
సీఎస్కే
author img

By

Published : Aug 24, 2020, 11:04 AM IST

Updated : Aug 24, 2020, 11:38 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​ ​కోసం క్రికెట్​ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు దుబాయ్​కి చేరుకుని.. క్వారంటైన్​ నిబంధనలు పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా హోటల్​ గదులకే పరిమితమయ్యారు. ఇటీవలే దుబాయ్​లో అడుగుపెట్టిన జట్లలో చెన్నైసూపర్​కింగ్స్​ ఒకటి. కొంతమంది ఆటగాళ్లు క్వారంటైన్​ అనుభవాలను సోషల్​మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఫ్రాంచైజీలు కూడా క్రమం తప్పకుండా అప్​డేట్స్​తో పోస్టులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎస్కే​ ఆటగాడు రవీంద్ర జడేజా.. విద్యా వాక్స్​ మలయాళ పాటకు వర్కౌట్​​ చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది ఫ్రాంచైజీ.

యూఏఈకి బయలుదేరే ముందు చెన్నైలో సీఎస్కే ఐదురోజుల పాటు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల జడేజా దీనికి హాజరు కాలేదు. భారత్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఐపీఎల్​ను యూఏఈకి తరలించారు. ఈ క్వారంటైన్​ సమయంలో ఆటగాళ్లకు ఐదుసార్లు కొవిడ్​ పరీక్షలు నిర్వహించనున్నారు. వాటిని దాటుకుని వచ్చినవారే సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే లీగ్​లో ఆడనున్నారు.

Last Updated : Aug 24, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.