Three Girls died in Wanaparthy: వనపర్తి జిల్లాలో చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతి చెందారు. శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన కురుమయ్య, భాగ్యమ్మ దంపతులకు ఐదు మంది సంతానం.. గ్రామంలోనే ఉంటూ దినసరి కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం దంపతులిద్దరూ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమార్తెలు తిరుపతమ్మ (14), సంధ్య (12), దీపిక (10) ముగ్గురు కలిసి గ్రామ సమీపంలోని వీరసముద్రం చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. బట్టలు ఉతుకుతున్న సమయంలో చిన్న చెల్లెలు దీపిక నీళ్లలో పడిపోయింది.
అది గమనించిన సంధ్య చెల్లెల్ని కాపాడేందుకు చెయ్యి అందించి.. జారీ ఆమె నీళ్లలోకి పడిపోయింది. ఇద్దరు చెల్లెలు నీళ్లలో మునగటాన్ని గమనించిన తిరుపతమ్మ వారిని కాపాడేందుకు చెరువులోకి దూకింది ఈత రాకపోవడంతో ముగ్గురు నీళ్లలో మునిగిపోయారు. అటుగా వెళ్తున్న శివ ఘటనా స్థలానికి చేరుకునే లోపే ముగ్గురు బాలికలు మృతి చెందారు. అనంతరం నీళ్లలో మునిగిన వారిని బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
నీటి కుంటలో పడి బాలుడు మృతి: ఇదే మాదిరిగా మరో జిల్లాలో నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటి దగ్గర సరదాగా గడుపుతారని భావించి పంపించారు. అంతలోనే వారికి విషాదం ఎదురైంది. పదేళ్ల బాలుడు ఈతకు వెళ్లి.. మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండల కేంద్రానికి చెందిన చిన్నబోయిన వీరయ్య మంజల దంతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక్క కుమారుడు. వీరు జీవనోపాధి కోసం గత కొంత కాలంగా హైదరాబాద్లో రోజువారి కూలిచేసి జీవనం గడుపుతున్నారు.
వేసవి సెలవులు అయినందున యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలో ఉన్న వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఉదయం సరదాగా తమ వ్యవసాయ బావి పక్కనే ఉన్న ఊరకుంటకు మహేష్ ఇద్దరు పిల్లలతో కలసి మొత్తం ఐదుగురు ఈతకు వెళ్లారు. కుంటలో ఈత కొడుతున్న సమయంలో మనోజ్ కుమార్ (10) నడుముకు ఉన్న మొలతాడు.. కుంట అడుగు భాగంలో ఉన్న చెట్టు మొదలకు చిక్కుకుంది. దీంతో బాలుడుకి ఊపిరి అందక మృతి చెందాడు.
బాలుడి అక్క తమ్మున్ని కాపాడే ప్రయత్నంలో తాను కుంటలో పడిపోయి కొట్టుకుంటున్న సమయంలో.. అక్కడ ఉన్న మేనమామ అమ్మాయిని కాపాడాడు. మనోజ్ ఎక్కడికి వెళ్లాడని అడగగా.. తమ్ముడు కుంటలో పడిపోయాడని చెప్పింది. గ్రామస్ధుల సహకారంతో గాలించగా కుంట అడుగుబాగంలో ఉన్న బాలున్ని వెలుపలకి తీశారు. వెంటనే బాలుడికి ప్రథమ చికిత్స అందించారు. ఎంత ప్రయత్నం చేసిన అప్పటికే బాలుడు మృతి చెందడంతో ఫలితం దక్కలేదు.
ఇవీ చదవండి: