ETV Bharat / briefs

వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Three people died after going swimming
ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
author img

By

Published : Apr 9, 2023, 2:49 PM IST

Updated : Apr 9, 2023, 4:02 PM IST

14:37 April 09

ఈతకు దిగి ఇద్దరు.. కాపాడబోయి మరొకరు..?

Three people dead after going swimming: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం అలవలపాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. అప్పటివరకు తమ కళ్లముందు ఆడుతూ పాడుతూ తిరిగిన ఇద్దరు చిన్నారులు, ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలవలపాడు పరిసరా ప్రాంతంలో ఉన్న జిఎన్ఎస్ఎస్ కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులతో పాటు మరో యువకుడు మృతి చెందారు. సరదా కోసం నీటిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. మృతులు అలవలపాడుకు చెందిన సాయితేజ (6), సుశాంతి (8), జ్ఞానయ్య (20)గా గుర్తించారు.

సెలవు రోజు కావడంతో సరదాగా... ఇద్దరు పెద్ద కాలువలో ఈత కోసం జిఎన్ఎస్ఎస్ వెళ్లినట్లు స్థానికులు వెల్లడించారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే ఇద్దరు చిన్నారులు మునిగిపోతుండగా... యువకుడు జ్ఞానయ్య వారిని కాపాడే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో జ్ఞానయ్య సైతం మృతి చెందినట్లు అనిపిస్తుందని వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల సమక్షంలో నీటిలో ఉన్న మృతదేహాలను వెలికితీశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 9, 2023, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.