కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనైతికంగా తెరాసలో చేర్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అనైతిక చర్యలకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో తెరాస ఏ ఒక్కటీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేలా కేంద్రంపై పోరాడుతామని వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఎన్డీఏపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. రాహుల్‌గాంధీ నాయకత్వంపై సంపూర్ణ నమ్మకం ఉందని... ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీయే కొనసాగాలని కోరారు. ఈ విషయమై ఉత్తమ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు తొమ్మిదో తరగతి విద్యార్థి ట్వీట్