ETV Bharat / briefs

హైదరాబాద్​లో మరో రూ. 2.40 కోట్లు స్వాధీనం - cash seized in hyderabad

లోక్​సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్​ లంగర్​హౌస్​లో కారులోకి అక్రమంగా తరలిస్తున్న రూ. 2.40 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్​లో రూ. 2.40 కోట్లు స్వాధీనం
author img

By

Published : Apr 9, 2019, 11:27 AM IST

Updated : Apr 9, 2019, 2:11 PM IST

హైదరాబాద్​లో టాస్క్​ఫోర్స్​ అధికారులు మరోసారి భారీ నగదును పట్టుకున్నారు. లంగర్​హౌస్​లోని పీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ హైవే వంతెన వద్ద ద్విచక్రవాహనం నుంచి కారులోకి డబ్బులు మారుస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారికి రూ. 2.40 కోట్లు పట్టుబడ్డాయి. పోలీసులు ఒక బైక్​, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొరికిన సొమ్మును ఐటీ అధికారులకు అందజేశారు. గత రెండురోజుల్లో హైదరాబాద్​లోనే రూ.10 కోట్లు దొరకడం వల్ల పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.

హైదరాబాద్​లో రూ. 2.40 కోట్లు స్వాధీనం

ఇదీ చదవండిః పోలీసులకు చిక్కిన రూ.8 కోట్లు కమలానివే...!

Last Updated : Apr 9, 2019, 2:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.