ETV Bharat / briefs

'ఆపరేషన్ సుదర్శన్​'తో సరిహద్దులు భద్రం - మాదక ద్రవ్యాలు

భారత్​ పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి.. 'చొరబాటు నిరోధక గ్రిడ్​' ను పటిష్ఠం చేస్తోంది బీఎస్​ఎఫ్. ఇందు కోసం వేలాది సైనికులు, అధికారులు, యంత్రసామగ్రిని జమ్ము, పంజాబ్​ సరిహద్దులకు తరలిస్తోంది.

అపరేషన్ సుదర్శన్​తో సరిహద్దులు భద్రం
author img

By

Published : Jul 8, 2019, 7:22 AM IST

భారత్​ పాక్​ సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్​) నడుం బిగించింది. జమ్ము, పంజాబ్​ల్లోని పాక్ సరిహద్దుల వెంబడి 'చొరబాటు నిరోధక గ్రిడ్​'ను పటిష్టం చేయుటకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందు కోసం వేలాది సైనికులు, అధికారులను, యంత్రసామగ్రిని ఆ ప్రాంతాల్లో మోహరించింది.

జులై 1న ఈ ఆపరేషన్​ 'సుదర్శన్​' ప్రారంభమైంది. ఇది సుమారు 1000 కి.మీల పొడవైన భారత్​-పాకిస్థాన్​ అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షిస్తుంది.

అత్యంత సున్నితమైన భారత్​-పాక్ సరిహద్దు... జమ్ములో 485 కి.మీ, పంజాబ్​లో 553 కి.మీలు విస్తరించి ఉంది. భారత పశ్చిమాన ఉన్న రాజస్థాన్​, గుజరాత్​ల వరకూ ఈ సరిహద్దు కొనసాగుతోంది. భారత సరిహద్దు దళం ముందువరుసలో నిలిచి ఈ సరిహద్దును కాపాడుతోంది.

ఉగ్రవాదుల చొరబాటు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం సహా... పాక్​ దాడులకు దీటుగా స్పందించడానికి బీఎస్​ఎఫ్​ సరిహద్దు రక్షణ స్థావరాలను, ప్రదేశాలను బలోపేతం చేస్తోంది.

ఇదీ చూడండి: సిద్ధరామయ్య సీఎం అయితే అభ్యంతరం లేదు'

Intro:Body:

l

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.