అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్లు కేరళ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారి కోసం అలప్పుజలో 'ఈనాడు సహాయ నిధి'తో తొలి దశలో నిర్మిస్తోన్న 43 ఇళ్లు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి మార్చి 2న శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం వీటి పునాదులు పూర్తయ్యాయి. నిర్మాణ పనులన్నీ కుటుంబ శ్రీ మిషన్ తరఫున మహిళలే చేపట్టారు. ఉత్సాహంగా పాల్గొని వడివడిగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రూ. 7.7 కోట్లతో ఈనాడు సహాయ నిధితో మూడు దశల్లో మొత్తం 116 ఇళ్లను నిర్మించాలనేదే లక్ష్యం. ఈ ఇళ్లలో రెండు పడకగదులు, హాలు, వంటగది, బాత్ రూం సౌకర్యాలుంటాయి. జాయింట్ కలెక్టర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇవీ చూడండి:ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలో 'బాహుబలి'