ETV Bharat / briefs

ఆహారంలో బల్లి: 12 మంది చిన్నారులకు అస్వస్థత

రోజూలానే అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నం చిన్నారులు భోజనం చేస్తున్నారు. మొదట నలుగురు తిన్నారు. తర్వాత కొంత మంది పిల్లలు తినేప్పుడు ప్లేట్​లో బల్లి పిల్ల దర్శనమిచ్చింది. వెంటనే స్పందించిన అంగన్వాడీ ఆయా.. పిల్లలందరినీ ఆస్పత్రికి చేర్చింది.

author img

By

Published : Jun 26, 2019, 10:22 PM IST

12 little children felt sick due to food poison.... Lizard in food

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాం తండాలోని అంగన్వాడీ సెంటర్​లో కలుషిత ఆహారం తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం మొదటగా నలుగురు విద్యార్థులు భోజనం చేశారు. అనంతరం మరికొంత మంది విద్యార్థులు తినే సమయంలో అన్నంలో బల్లి పిల్ల కనపడింది. వెంటనే స్పందించిన అంగన్వాడీ ఆయా 108కు ఫోన్​లో సమాచారం అందించింది. హుటాహుటిన చేరుకొన్న సిబ్బంది ఆహారం తిన్న 12 మంది పిల్లలను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. 24 గంటల పర్యవేక్షణ అనంతరం పరిస్థితిని బట్టి ఇంటికి పంపిస్తామని తెలిపారు.

ఆహారంలో బల్లి...

ఇవీ చూడండి: చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.