ETV Bharat / briefs

లేటైనా లేటెస్ట్​గా హిట్​ కొట్టిన చిత్రాలు!

బాలీవుడ్​లోని కొన్ని సినిమాలు.. పలు కారణాల వల్ల ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోలేదు. అనంతరం కొన్నేళ్లకు అన్ని అడ్డంకులు తొలిగి, ప్రేక్షకుల ముందుకొచ్చి విశేషాదరణ దక్కించుకున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? ప్రజల ముందుకు ఎప్పుడొచ్చాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

10 Movies that took long to hit screens
లేట్​ అయినా లేటెస్ట్​గా హిట్​ కొట్టిన చిత్రాలు!
author img

By

Published : Feb 25, 2021, 9:31 AM IST

Updated : Feb 25, 2021, 10:51 AM IST

ఓ సినిమా తీయాలంటే ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఎంతోమంది రాత్రింబవళ్లు శ్రమిస్తే ఓ చిత్రం రూపొందుతుంది. అయితే ఆర్థిక సమస్యలు సహా పలు కారణాలతో కొన్ని సినిమాల షూటింగ్​లు మధ్యలోనే ఆగిపోతుండగా.. మరికొన్ని ఆలస్యంగా చిత్రీకరణ జరుపుకొంటుంటాయి. కొన్ని చిత్రాలయితే ఏళ్ల పాటు విడుదలకు నోచుకోవు. కానీ చాలా ఏళ్ల తర్వాత విడుదలై ప్రేక్షాదరణ పొందుతాయి. అలా విడుదల ఆలస్యమైనా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన చిత్రాలంటే చూద్దాం.

ఐ లవ్​ న్యూ ఇయర్(2015)

బాలీవుడ్​ స్టార్​ నటులు సన్నీ దేఓల్​, కంగనా రనౌత్​ కలిసి నటించిన ఈ సినిమాను 2011లో మొదలుపెట్టగా.. 2015లో విడుదలకు నోచుకుంది. సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Movies that took l10 Movies that took long to hit screensong to hit screens
ఐ లవ్​ న్యూ ఇయర్

జమ్మనాత్​(2014)

1986లో ఈ సినిమా స్క్రిప్ట్​ వర్క్ పూర్తయింది. పదేళ్ల తర్వాత సెట్స్​పైకి వెళ్లి, దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఇందులో అమితాబ్​ బచ్చన్​, కరిష్మా కపూర్​, అర్షద్​ వార్సీ కీలక పాత్రలు పోషించారు. 2014లో విడుదలై ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

10 Movies that took long to hit screens
జమానత్

దీవానా మై దీవానా(2013)

గోవింద, ప్రియంకా చోప్రా కలిసి నటించిన ఈ చిత్రం.. 2013లో విడుదలై హిట్​గా నిలిచింది. ఇందులోని ప్రత్యేక గీతం 'కాలా డొరియా' కుర్రకారును ఉర్రూతలూగించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు జరిగిందో సరిగ్గా తెలీదు. అప్పుడు రెండు పదుల వయసులో ఉంది ప్రియంక. కాబట్టి దీని ఆధారంగా ఈ చిత్రం చాలా కాలం పాటు విడుదలకు నోచుకోలేదని తెలుస్తోంది.

10 Movies that took long to hit screens
దీవానా మై దీవానా

సనమ్​ తేరీ కసమ్​(2009)

సైఫ్​ అలీఖాన్​, పూజా భట్​, అతుల్ అగ్నిహోత్రి, షీబా అక్షదీప్​ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్​ జరిగిన దాదాపు పదిహేనేళ్ల తర్వాత 2009లో విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

Movies that took long to hit screens
సనమ్ తేరీ కసమ్

మెహబూబా(2008)

ఇందులో సంజయ్​ దత్​, అజయ్​ దేవగణ్​, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించారు. 1999లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్​ అనివార్య కారణాల వల్ల ఆగుతూ ఆగుతూ 2003లో పూర్తిచేసుకుంది. 2008లో విడుదలై బాగా ఆడింది.

Movies that took long to hit screens
మెహబూబా

యే లమ్హే జుదాయి కే(2004)

బాలీవుడ్​లో అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో షారుక్​ ఖాన్ ఈ చిత్రంలో నటించారు. రవీనా టాండన్​ హీరోయిన్​. అయితే షూటింగ్​ ప్రారంభించిన కొన్ని రోజులకే చిత్రీకరణ నిలిచిపోయింది. ఆ తర్వాత 1994లో స్క్రిప్ట్​లో మార్పులు చేసి దానిని పూర్తిచేశారు. అనంతరం పదేళ్ల తర్వాత 2004లో విడుదలై​ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

10 Movies that took long to hit screens
యే లమ్హే జుదాయి కె

హమ్​ తుమ్హారే హై సనమ్​(2002)

సల్మాన్, షారుక్​ నటించిన ఈ మల్టీస్టారర్​లో మాధురీ దీక్షిత్​ కథానాయిక. 1996లో మొదలుపెట్టగా.. ఆరేళ్ల పాటు ప్రొడక్షన్​ పనులు జరుపుకొని 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో తొలుత సన్నీ దేఓల్​, అమీర్​ ఖాన్​, జూహీ చాహ్లాను అనుకున్నారు.

10 Movies that took long to hit screens
హమ్​ తుమ్హారే హై సనమ్

అతాంక్​ హై అతాంక్​(1995)

క్రైమ్​ కథాంశంతో హీరో అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తీసిన ఈ సినిమా బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. అయితే ఇందులోని తన నటనకుగానూ అసంతృప్తి చెందానని అమిర్​, గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Movies that took long to hit screens
అతాంక్ హై అతాంక్

పాకీజా(1972)

తొలుత బ్లాక్​ అండ్​ వైట్​లో విడుదలైన పాకీజా.. మంచి విజయం సాధించింది. అనంతరం ఈ చిత్రాన్ని మళ్లీ చిత్రీకరణ జరిపి కలర్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 1957 నుంచి 1964 వరకు చిత్రీకరణ జరుపుకుందీ సినిమా. అనంతరం 1972లో విడుదలైంది.

10 Movies that took long to hit screens
పాకీజా

ఇట్స్​ మై లైఫ్​(2020)

తెలుగు సినిమా 'బొమ్మరిల్లు' హిందీ రీమేక్​ 'ఇట్స్​ మై లైఫ్'​. మాతృకలోని హీరోయిన్​ జెనిలీయానే ఇందులోనూ నటించింది. హర్మన్​ బవేజా హీరో. నానా పాటేకర్​ కథానాయకుడిగా తండ్రిగా చేశారు. 2007లో మొదలైన ఈ సినిమా.. ఇన్నేళ్ల పాటు అనివార్య కారణాలతో ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు పదమూడేళ్ల విరామం తర్వాత గతేడాది నవంబరు 29న టీవీలో నేరుగా విడుదలైంది.

10 Movies that took long to hit screens
ఇట్స్​ మై లైఫ్​(2020)

ఇవీ చూడండి: ఇరువురు భామలు.. ఇరుకున హీరోలు!

Last Updated : Feb 25, 2021, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.