తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌కు కరోనా కాటు. కంట్రోల్ రూమ్‌లో నిత్యం పని చేస్తున్న పలువురు నాయకులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. వారం రోజుల పాటు గాంధీభవన్ మూసివేతకు కార్యాలయ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి : భద్రాద్రి కొత్తగూడెం మల్లెపల్లితోగులో ఎదురు కాల్పులు