రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి.
రాష్ట్రంలోని 120 మంది ఎమ్మెల్యేలు, 33 మంది ఎమ్మెల్సీలకు నిధులు విడుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.2.5 కోట్ల చొప్పున ఇచ్చింది. మొత్తం 153 మందికి రూ.382.50 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: TS EAMCET RESULTS: రేపు ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు