YSRCP Tweet controversy on AP Secretariat: విశాఖ రుషికొండపై చేపట్టిన నిర్మాణాలపై వైసీపీ నాలిక మడతేసింది. అధికారిక ట్విటర్ ఖాతాలో శనివారం రాత్రి ప్రత్యక్షమైన ట్వీట్.. చర్చనీయాంశంగా మారింది. రుషికొండపై కడుతున్న నిర్మాణాలు.. రాష్ట్ర సచివాలయంగా పేర్కొంటూ శనివారం వైసీపీ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ పోస్ట్ చేసింది. సచివాలయ నిర్మాణానికి.. మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటూ టీడీపీని, జనసేనను ప్రశ్నించింది.
ఇప్పటివరకూ ఆ నిర్మాణాలపై రోజుకో మాట చెప్పిన వైసీపీ.. ఇప్పుడు దానిని సచివాలయం కోసం చేపడుతున్న నిర్మాణంగా పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని న్యాయవాదులు స్పష్టంచేశారు. రుషికొండపై చేపట్టిన నిర్మాణం ప్రభుత్వ అతిథిగృహం మాత్రమేనని వైసీపీ గతంలో చెప్పింది. అందుకు విరుద్ధంగా అసలు అక్కడ నిర్మాణాలే జరగడం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు వివరణ ఇచ్చింది.
దీనిపై తెలుగుదేశం, జనసేన హైకోర్టులో పిటిషన్ వేశాయి. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టి నిర్మాణాలు చేపట్టారని.. ఇరు పార్టీలు ఆరోపించాయి. దీనిపై కమిటీ ఏర్పాటు చేసిన హైకోర్టు... పిటిషనర్లు పేర్కొన్నట్లు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టంచేసింది. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర పర్యావరణ శాఖకు సిఫారసు చేస్తామని గతంలోనే తెలిపింది.
రుషికొండపై రాష్ట్ర సచివాలయం నిర్మిస్తున్నామంటూ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ పోస్టు చేసిన వైసీపీ... 24 గంటలు గడవక ముందే తూచ్ అంటూ మాట మార్చింది. వివిధ వర్గాల విమర్శల అనంతరం దానిని తొలగించింది. అవి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలుగా భావించాలంటూ.... మరో ట్వీట్ చేసింది. మానవ తప్పిదాలు సహజంగా జరుగుతుంటాయని.. పొరపాటుగా ట్వీట్ చేసినట్లు వివరణ ఇస్తూ మరో ట్వీట్లో తెలిపింది. అందుకే ట్వీట్‌ను తొలగించినట్లు పేర్కొంది. తప్పులు జరిగినప్పుడు అంగీకరించడం తమ విధానమని తెలిపింది.
YCP Tweet on Visakha Rushikonda Constructions: విశాఖ రుషికొండ నిర్మాణాలపై.. వైసీపీ క్లారిటీ..
రుషి కొండపై జరుగుతోంది సచివాలయం కాదని, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నట్లుగా పరిగణించాలని తెలిపింది. సచివాలయం కానప్పుడు దేని కోసం ఆ భవనాలను నిర్మిస్తున్నారనే విషయాన్ని మాత్రం ట్వీట్లో స్పష్టం చేయలేదు. ట్వీట్‌ను తొలగించడంపై తెలుగుదేశం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్వీట్‌ను డిలీట్ చేయడానికి కారణమేంటి బుజ్జికన్నా అని ప్రశ్నించింది. భయమేసిందా..? సిగ్గేసిందా..? లేక తాడేపల్లి సైకో నుంచి కోటింగ్ పడిందా అని ప్రశ్నించింది. వైకాపా ట్వీట్‌ను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని విశాఖ జనసేన నేత మూర్తి యాదవ్ తెలిపారు.
"అధికారిక వారి పార్టీ ట్విటర్లో ప్రభుత్వం సచివాలయం కోసం నిర్మాణం జరుగుతోందని ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా అర్థరహితం. రాష్ట్ర ప్రజలను, అధికారులను, అదే విధంగా కేంద్రాన్ని మోసం చేసి తెచ్చుకున్న అనుమతులకు విరుద్ధంగా అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తేటతెల్లమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారికంగా చేసిన ట్వీట్ గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం". - మూర్తి యాదవ్, జనసేన నేత
రుషికొండపై దూకుడు పెంచిన ప్రభుత్వం.. నిర్మాణ పనుల కోసం టెండర్ల ఆహ్వానం