ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (నవంబర్​ 14 - నవంబర్​ 20)

author img

By

Published : Nov 14, 2021, 3:10 AM IST

Updated : Nov 14, 2021, 3:19 AM IST

ఈ వారం (నవంబర్​ 14 - నవంబర్​ 20) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

ఈ వారం (నవంబర్​ 14 - నవంబర్​ 20) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

.

మనోబలంతో ముఖ్యకార్యాలను పూర్తి చేసుకోవాలి. ధనధాన్య లాభం సూచితం. స్వధర్మం, చిత్తశుద్ధి విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆవేశపరిచే వారున్నారు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇష్టదేవతాస్మరణ మేలుచేస్తుంది.

.

అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. ప్రశంసలు నూతన కార్యాలకు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ధైర్యంగా మంచి పనులు మొదలెట్టండి. వారాంతంలో అదృష్టఫలం అందుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.

.

ముఖ్యకార్యాల్లో ఆటంకం ఎదురవుతుంది. సహనం అవసరం. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సలహాతో మంచి జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పనీ శ్రద్ధగా చేయండి. చిన్న పొరపాటు జరిగినా నిరాశ కలుగుతుంది. ధర్మ మార్గంలో పనిచేస్తే విజయం లభిస్తుంది. పూర్వ పుణ్యం కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

.

అదృష్టయోగముంది. సకాలంలో నిర్ణయం తీసుకుని లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. పదిమందికీ ఆదర్శమవుతారు. వ్యాపారబలం పెరుగుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. సంతోషించే అంశాలుంటాయి. ఖర్చు పెరగనివ్వద్దు. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.

.

శుభకాలం నడుస్తోంది. అపారమైన ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుఉంటాయి. మంచి ఆలోచనలు బంగారు జీవితాన్నిస్తాయి. ప్రతి బంధకాలు తొలగుతాయి. పట్టుదలతో చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ తోడ్పాటు లభిస్తుంది. విష్ణునామస్మరణతో శక్తి పెరుగుతుంది.

.

అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో లాభపడతారు. స్వల్ప విఘ్నాలున్నా కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ఒక విషయంలో చివరి వరకూ వెళ్లి తిరిగి వస్తారు. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. వాటి ఆసరాతో ఒక్కో మెట్టూ పైకి ఎక్కాలి. ఆంజనేయస్వామిని ధ్యానించండి, శక్తి లభిస్తుంది.

.

సకాలంలో పనులు ప్రారంభించండి, విజయం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. శత్రు పీడ వెంటాడుతోంది. వివాదాలకు తావివ్వద్దు. పెద్దలవల్ల మేలు జరుగుతుంది. అనుకున్నది సాధించేవరకూ పట్టు వదలవద్దు. వారం మధ్యలో ఒక పని పూర్తి అవుతుంది. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.

.

లక్ష్మీ కటాక్షసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. పట్టువిడుపులతో వ్యవహరించండి. లక్ష్యంపై దృష్టి పెట్టండి. కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ముఖ్య వ్యక్తుల సూచనలతో విఘ్నాలు తొలగుతాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారలాభం సూచితం. ఇష్టదైవస్మరణ శుభప్రదం.

.

అదృష్టయోగముంది. సరైన నిర్ణయం తీసుకోండి. ఇంటాబయటా గొప్ప ఫలితాలున్నాయి. ఎదురుచూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార లాభాలున్నాయి. గృహ, వాహనయోగం సూచితం. మిత్రుల ప్రోత్సాహం, బంధువుల ఆదరణ లభిస్తాయి. ఇష్టదేవతను దర్శించండి. ఆనందప్రదమైన జీవితాన్ని పొందుతారు.

.

ఉద్యోగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారంలో మెలకువలు అవసరం, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లండి. మీ అంచనాలను ఎవరూ అందుకోలేని విధంగా కృషిచేయండి. అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది. మంచి మిత్రుల సాయం కోరండి. అనుకున్నది జరుగుతుంది. శివారాధన శ్రేయోదాయకం.

.

మనోబలం ముందుకు నడిపిస్తుంది. ధనలాభం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. సరైన ప్రణాళికలతో కార్యసిద్ధి ఉంటుంది. చెడు ఊహించకండి. వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయండి. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. నిందలు మోపేవారున్నారు. రుణసమస్యలు పెరగనివ్వకండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహస్తుతి మేలు చేస్తుంది.

.

ఆపదలు తొలగుతాయి. ఆదర్శవంతమైన పనులతో కొత్త చరిత్రను లిఖిస్తారు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. నూతనావకాశాలు ఫలిస్తాయి. అభివృద్ధికి అవసరమైన అడుగులు వేస్తారు. అవి మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆస్తి పెరుగుతుంది. ఆత్మబలం రక్షిస్తుంది. అంచనాలకు తగ్గట్టుగా పనిచేయండి. లక్ష్మీదేవిని దర్శించుకోండి, విజయం లభిస్తుంది.

Last Updated : Nov 14, 2021, 3:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.