ETV Bharat / bharat

'ఆమె'తో యువకుడి పెళ్లి.. శోభనం గదిలోకి వెళ్లగానే షాక్.. ఆ తర్వాత..? - Two women fight on road in Jharkhand

అమ్మాయి అనుకుని నంపుసకుడైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. అనంతరం శోభనం గదిలోకి వెళ్లి కంగుతున్నాడు. దీంతో నిజం తెలుసుకుని.. విడాకులు కోసం ఏడేళ్ల పాటు కోర్టు చుట్టు తిరిగాడు. అతని బాధను అర్థం చేసుకున్న కోర్టు ఈ యువకుడికి విడాకులు మంజూరు చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. అతడు తన భర్తే అంటూ ఇరువురూ వాగ్యుద్ధానికి దిగారు.

young-man-married-eunuch-in-uttarpradesh-court-granted-divorce-to-man
యూపీలో నంపుసకురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు
author img

By

Published : Jun 17, 2023, 11:02 PM IST

అందరిలా అతడి వివాహం ఘనంగానే జరిగింది... ఆచార సంప్రదాయాల మధ్య అట్టహాసంగా పెళ్లి వేడుక సాగింది... అనుకున్నట్లుగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి... ఇక ఆనందంగా సంసారం జీవితంలోకి అడుగులేద్దామనుకున్న సమయంలో.. వరుడికి చెప్పలేని నిరాశ ఎదురైంది. శోభనం గదిలోకి వెళ్లిన యువకుడు ఒక్కసారిగా కంగుతినే పరిస్థితి ఏర్పడింది. తాను పెళ్లి చేసుకున్నది అసలు మహిళను కాదని తెలుసుకుని షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. చివరకు బాధితుడు న్యాయపోరాటానికి దిగాడు.

అసలేమైందంటే?
ఉత్తర్​ప్రదేశ్​.. ఆగ్రా జిల్లాలోని ఇత్మాదుద్దౌలా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడికి 2016 జనవరి 27న వివాహం జరిగింది. సంప్రదాయ పద్దతిలో ఘనంగా పెళ్లి జరిగింది. అనంతరం మరుసటి రోజు భార్యభర్తలిద్దరు కలిసి వరుడి ఇంటికి వచ్చారు. అక్కడ కూడా ఆచారాల ప్రకారం జరగాల్సిన కార్యక్రామాలన్ని సాఫీగా జరిగాయి. అనంతరం మొదటి రాత్రి భార్య గదిలోకి వెళ్లిన భర్త ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె శరీర భాగాలు చూసి బిత్తరపోయాడు. తాను పెళ్లి చేసుకున్నది ఓ నంపుసకుడైన వ్యక్తినని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

కానీ, ఆ విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పలేదు ఆ యువకుడు. పరువుపోతుందన్న భయంతో.. ఆ విషయాన్ని అలాగే దాచిపెట్టాడు. రహస్యంగా తన భార్యను పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యులకు చూపించాడు. కానీ లాభం లేకుండా పోయింది. అతడ్ని పూర్తిగా మహిళను చేసేందుకు వీలుకాదని వైద్యులు తేల్చారు. దీంతో ఇక చేసేది లేక కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏడేళ్ల తరువాత పెళ్లి చెల్లదంటూ తాజాగా తీర్పునిచ్చింది.

"పెళ్లైన మరుసటి రోజే నా భార్య గురించి నిజం తెలిసింది. ఊర్లో అందరు ఆటపట్టిస్తారని ఆ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు. ఈ పెళ్లితో నా పరిస్థితి దయనీయంగా మారింది. చివరకు డాక్టర్లు కూడా చేతులెత్తేశారు" అని బాధితుడు తెలిపాడు. ఇక చేసేది లేక విడాకులు కోసం కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించాడు.

ఒక భర్త.. రోడ్డుపై ఇద్దరు భార్యల పోరు!
మరోవైపు, ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై గొడవకు దిగారు. ఇద్దరు మహిళలు.. ఆ వ్యక్తి తన భర్తే అంటూ వాగ్వాదానికి తెరలేపారు. రోడ్డు మధ్యలోనే ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఒక్కసారిగా జనం గూమిగూడారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు మహిళలను, ఆ వ్యక్తి అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్​లోని కొడెర్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Two women fight on road for husband
ఘటన ప్రదేశంలో గూమిగూడిన జనం

బర్కతా ప్రాంతానికి చెందిన సందీప్ రామ్ అనే వ్యక్తికి.. 2015లో గుడియా దేవితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. సందీప్ ముంబయిలోని ఓ హోటల్​లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితం ఛత్తీస్​గఢ్​కు చెందిన పూజ అనే మహిళతో ఇతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సందీప్ భార్యకు తెలిసింది. దీంతో భర్తతో గొడవపడి.. పుట్టింటికి వెళ్లింది గుడియాదేవి.

కాగా, మూడు రోజు క్రితం సందీప్​ ముంబయి నుంచి సొంతూరికి వచ్చాడు. అనంతరం ఝుమ్రీ తిలయ్యాలోని ఝండా చౌక్ వద్ద పూజతో కలిసి భార్య గుడియాదేవి కంటపడ్డాడు​. దీంతో అక్కడే భర్తతో గొడవకు దిగింది గుడియా దేవి. పూజతో కూడా వాగ్వాదం పెట్టుకుంది. కాసేపటికి ముగ్గురి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అనంతరం అక్కడకు వచ్చిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.