ETV Bharat / bharat

నిరసనలకు బ్రేక్​.. న్యాయపోరాటం మాత్రం ఆగదు: రెజ్లర్​ బజరంగ్​ పూనియా​ - wrestlers problem anurag thakur

Wrestlers Protest update : బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్​ అరెస్టును కోరుతూ నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్​తో భేటీ అయ్యారు. జూన్​ 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు రెజ్లర్​ బజరంగ్​ పూనియా తెలిపాడు. ఉద్యమం మాత్రం ఇంకా ముగియలేదని చెప్పాడు.

wrestlers protest update
wrestlers protest update
author img

By

Published : Jun 7, 2023, 6:17 PM IST

Updated : Jun 7, 2023, 6:37 PM IST

Wrestlers Protest Anurag Thakur : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్​ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్​ను కలిశారు. బుధవారం ఆయనతో రెజ్లర్లు భేటీ అయ్యారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సహా పలువురు రెజ్లర్లో ఆయన ఇంటికి వెళ్లారు.

Wrestlers Protest Bajarang Punia : కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​.. ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత రెజ్లర్​ బజరంగ్​ పూనియా మీడియాతో మాట్లాడారు. జూన్​ 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు తెలిపాడు. ఉద్యమం మాత్రం ఇంకా ముగియలేదని చెప్పాడు. "జూన్ 15 లోపు పోలీసు విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరాం. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. బ్రిజ్​ భూషణ్​ సింగ్​పై జూన్ 15లోగా ఎలాంటి చర్యలు తీసుకోకుంటే మళ్లీ నిరసన కొనసాగిస్తాం" అని తెలిపాడు. పార్లమెంట్​ ప్రారంభోత్సవం నాడు రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీ పోలీసులు ఉపసంహరించుకుంటారని రెజ్లర్​ సాక్షి మాలిక్​ చెప్పింది.

  • #WATCH | Government has assured us that police investigation will be completed before 15th June. We have requested that all FIRs against wrestlers should be taken back and he has agreed to it. If no action is taken by 15th June, we will continue our protest: Wrestler Bajrang… pic.twitter.com/1hi9Qp0RFY

    — ANI (@ANI) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జూన్​ 30లోగా డబ్ల్యూటీసీ ఎన్నికలు: అనురాగ్​ ఠాకూర్​
రెజ్లర్లతో సమావేశమైన తర్వాత కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గంటల పాటు రెజ్లర్లతో సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. జూన్​ 15వ తేదీలోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు సమర్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. జూన్​ 30లోగా డబ్ల్యూటీసీ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.

"ఒక మహిళ నేతృత్వంలో రెజ్లింగ్​ ఫెడరేషన్​కు అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేస్తాం. రెజ్లర్లపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను పోలీసులు వెనక్కి తీసుకోవాలి. బ్రిజ్ భూషణ్ సింగ్​తో పాటు ఆయన సహచరులను తిరిగి ఎన్నుకోవద్దని రెజ్లర్లు అభ్యర్థించారు. జూన్ 15లోపు రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరు" అని అనురాగ్​ ఠాకూర్​ చెప్పారు.

  • #WATCH | I had a long 6-hour discussion with the wrestlers. We have assured wrestlers that the probe will be completed by 15th June and chargesheets will be submitted. The election of WFI will be done by 30th June: Union Sports Minister Anurag Thakur after meeting wrestlers pic.twitter.com/9hySRefxNM

Wrestlers Meet Amit Shah : మూడు రోజుల క్రితమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్​పై నమోదైన లైంగిక వేధింపుల కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రెజ్లర్లు విజ్ఞప్తి చేశారు. జూన్​ 4న కేంద్ర మంత్రితో భేటీ అయిన రెజ్లర్లు.. తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సత్యవత్ కేదాన్.. అమిత్ షాతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమస్యపై తాను దృష్టిసారిస్తానని అమిత్ షా.. రెజ్లర్లతో హామీ ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన రెజ్లర్లతో అన్నారు.

రెజ్లర్లకు మద్దతును ఉపసహరించుకోలేదు: టికాయత్​
Rakesh Tikait Wrestlers Protest : రెజ్లర్లకు తమ మద్దతును ఉపసహరించుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్​ టికాయత్​ వెల్లడించారు. డబ్లూఎఫ్​ఐ చీఫ్ బ్రిజ్​ భూషణ్ శరణ్ సింగ్​కు వ్యతిరేకంగా జూన్​ 9న నిర్వహించతలపెట్టిన ప్రదర్శనను కేవలం వాయిదా మాత్రమే వేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెజ్లర్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అమిత్ షాతో రెజ్లర్లు భేటీ అయిన తరువాత రైతు సంఘాల నేతలు.. మల్లయోధులకు మద్దతు ఉపసహరించుకున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే టికాయత్​ దీనిపై స్పష్టత ఇచ్చారు. "జూన్ 9న దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనను ప్రస్తుతానికి వాయిదా వేశాం. ప్రభుత్వానికి, రెజ్లర్లకు మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో.. కేంద్రం నుంచి వచ్చే స్పందన కోసం వేచిచూస్తున్నాం. మేము రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నాం. కొనసాగిస్తాం" అని టికాయత్​ అన్నారు. ప్రభుత్వంతో రెజ్లర్ల తదుపరి సమావేశం గురించి తనకు తెలియదని ఆయన వెల్లడించారు.

Last Updated : Jun 7, 2023, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.