ETV Bharat / bharat

రికార్డు: 24 గంటల్లో 40కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం

దేశంలో రహదారి నిర్మాణాల్లో కొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలో 24 గంటల్లో 39.671 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగింది. ఇది ప్రపంచంలోనే అరుదైన విషయంగా భావిస్తున్నారు.

World Record by a Highway!
రహదారి నిర్మాణాల్లో కొత్త రికార్డు
author img

By

Published : Jun 1, 2021, 6:43 AM IST

దేశంలోని రహదారుల నిర్మాణంలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని సతారాలో 24 గంటల వ్యవధిలో 39.671 కిలోమీటర్ల పొడవైన రహదారి అందుబాటులోకి వచ్చింది.

అరుదైన విషయం..

ఇది ప్రపంచంలోనే అరుదైన విషయంగా భావిస్తున్నారు. గతంలో విజయ్​పుర్​- శోలాపుర్​ మధ్య 18 గంటల సమయంలో 25.54 కి.మీ. పొడవైన రహదారిని నిర్మించగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తాజాగా సతారా-పండర్​పుర్​ రహదారి వెడల్పు పనుల్లో భాగంగా పుసెగావ్​-మహాసుర్నే మధ్య 39.671 కి.మీ. పొడవైన రోడ్డును ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి సోమవారం ఉదయం 7 గంటల కల్లా పూర్తి చేశారు.

World Record by a Highway!
నిర్మాణ పనుల్లో భాగంగా
World Record by a Highway!
రోడ్డుపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లు

మహాక్రతువులో..

మహారాష్ట్ర ప్రజా పనుల విభాగం(పీడబ్ల్యూడీ) పర్యవేక్షణలో రాజ్​పత్​ ఇన్​ఫ్రాకాన్​ ఈ ఘనత సాధించింది. ఒకేసారి ఆరు ప్రాంతాల్లో మూడు షిప్టులలో పనులు కొనసాగాయి. ఈ మహాక్రతువులో 15 మంది పీడబ్ల్యూడీ ఇంజినీర్లు, 60 మంది గుత్తేదారులకు చెందిన ఇంజినీర్లు, 23 మంది క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, 47 మంది సూపర్​వైజర్లు, 150 మంది డ్రైవర్లు, 110 మంది కార్మికులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Viral: వేగంగా దూసుకొచ్చి.. ట్రాఫిక్​ పోలీస్​ను ఢీకొట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.