ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకొంటారు యువతీయువకులు. తమ కిష్టమైన వాళ్లతో మధుర జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోయేలా గడుపుతారు. అయితే.. ఈ సంవత్సరం ప్రేమికుల రోజు, ప్రపంచ వివాహ దినోత్సరం రెండూ ఒకే రోజు వచ్చాయని కొంతమందికే తెలుసు. ఏటా ఫిబ్రవరి రెండో ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ రోజును దంపతులు ఒకరిపై ఒకరు నమ్మకానికి, త్యాగానికి, హద్దులులేని ఆనందానికి ప్రతీకగా భావిస్తుంటారు.
పెళ్లంటే..?
సామాజికంగా లేదా చట్టపరంగా ఒప్పందం ద్వారా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టడం. ఈ బంధంతో ఇరువురికీ కొన్ని హక్కులు, బాధ్యతలు మొదలవుతాయి.
దేవుడిచ్చిన వరంగా ..
వైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే అనుసరించాల్సినవి ఎన్నో. అందులో కొన్ని:
- ఒకరికి ఒకరు దేవుడిచ్చిన వరంగా దాంపత్య జీవితాన్ని ఓ పండుగలా ప్రతిరోజు ఆస్వాదించండి.
- శుభకార్యాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలకు కలిసి వెళ్లండి.
- ఒక దగ్గర కూర్చొని పెళ్లి ఫొటోలు చూసి, నాటి విశేషాలు గుర్తు తెచ్చుకోండి.
- మీ పిల్లలకు మీరు ఎలా కలిశారో, ఎలా ప్రేమలో పడ్డారో చెప్పండి.
- మీ భాగస్వామిలో మీకు నచ్చే గుణాన్ని పొగుడుతూ ఉండండి. ఐ లవ్ యూ అని చెప్పండి.
- క్యాండిల్ లైట్ వెలుగులో మీ భాగస్వామికి ఇష్టమైన వంటను కలిసి ఆస్వాదించండి.
- మీ వివాహంపై మీ భాగస్వామికి ప్రేమ లేఖలు రాయండి.
భారత్లోనే విడాకులు తక్కువ ..
ప్రపంచంలోనే అతి తక్కువ విడాకులు తక్కువ నమోదయ్యే దేశం భారత్. ఇక్కడ ప్రతి వెయ్యి జంటల్లో 13 జంటలు మాత్రమే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నాయి.
విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి 5 కారణాలు
- మహిళలకు భావప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం.
- సంతోషం కంటే సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం.
- భారత్లో విడాకుల ప్రక్రియ నెమ్మదిగా సాగటం.
- చట్టబద్ధత కంటే నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం.
- మతపరమైన అంశాలు.
ఇదీ చదవండి : ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ఎందుకైందంటే.?