కరోనా నివారణకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి కొవాగ్జిన్ టీకాకు ఈ వారంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లభించే అవకాశముంది. సంబంధిత వర్గాలు ఈమేరకు వెల్లడించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రస్తుతం కొన్ని దేశాలు డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన టీకాలు తీసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌కు గుర్తింపు వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.